Friday 2 March 2012

గురువు గారు - పేటెంట్

గురువు గారిని అడిగాను పేటెంట్ అంటే ఏమిటి అని .... దానికి గురువు గారు దీర్ఘంగా ఆలోచించి చెప్పారు "బుజ్జి ఇప్పుడు నువ్వున్నావు నీకొక క్రొత్త విషయం తెలిసింది, దాన్ని నాకు చెప్పమన్నాననుకో నువ్వేమంతావు... ఆ నేను ఎంతో కష్టపడి ఈ విషయం తెలుసుకున్నాను నీకంత సులభంగా చెప్తానా అని అవునా? నేను అన్నాను అవును గురువు గారు నేను అంత కష్టపడి తెలుసుకున్న దాన్ని నేనెందుకు అంత వీజీగా చెప్తాను..అని...గురువు గారు నవ్వి అందుకే రా ఈ పేటెంట్ సిస్టం పుట్టుకొచ్చింది, నువ్వు నీకు తెలిసిన విషయాన్ని నీకే సొంతం అని రిజిస్టర్ చేసుకుని ఆ విషయం తెలుసుకుని లబ్ది పొందిన ప్రతీవారి దగ్గర నుండి అంతో ఇంతో డబ్బులు తీసుకుంటారు అన్నమాట!  ఇలా చెప్పి గురువు గారు పరధ్యానంలోకి వెళ్ళారు... దాంతో కంగారు పడి గురువు గారిని అడిగాను...ఏంటి గురువు గారు.. ఆలోచిస్తున్నారు  అని...దానికి ఆయన  ఏం లేదు బుజ్జి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు కొత్త విషయాలు చెప్పే మన ఉపాధ్యాయులు ఎంత గొప్పవారు కదా.. మనకు లెక్కలు నేర్పే మాష్టారు అరేయ్ నేను నీకు లెక్కలు నేర్పుతున్నాను కదా నువ్వు రేపు పెద్దవాడివి అయ్యాకా ఎవరి దగ్గరయినా వడ్డీ డబ్బులు లెక్క కట్టి వసూలు చేసావనుకో దాంట్లో కొంత నాకివ్వాలి ఎందుకంటే నేనే కదా నీకు బారువడ్డీ, చక్రవడ్డీ లెక్కలు చెప్పింది అని అడగరు  కదా.. అలాగే మనకు అక్షరాలూ  దిద్దించిన మాష్టారు అరేయ్ నువ్వు రేపు రాసే ప్రతీ పదానికి నాకు పైసా లెక్క కట్టివాలి ఎందుకంటే నేనే కదా నీకు రాయడం నేర్పింది అని అడగరు కదా... అందుకేరా తల్లి, తండ్రి, గురువు, దైవం అని....మన పెద్దలు చెప్పారు...ఇలా చెప్తూ గురువు గారు ఆవలించడంతో నేను లేచి గురువు గారికి నమస్కరించి, ఒకవేళ గురువు గారు చెప్పినట్టు అన్నిట్టికి మనం మన మాస్టార్లకు డబ్బులు ఇవ్వవలిసి  వస్తే మా గురువు గారు నా మూలాన కోటీశ్వరులు అవరూ!... అని ఆలోచిస్తూ బయట పడ్డాను.

గురుభ్యో నమః   

No comments:

Post a Comment