Friday 2 March 2012

గురువు గారు - సినిమా స్టొరీ

ఒక రోజు గురువు గారిని అడిగాను, "గురువు గారు మీరు ఈ మధ్య చాలా పరధ్యానంగా ఉంటున్నారు, ఏంటి సంగతి ?అని, దానికి గురువు గారు ఒక నిట్టూర్పు విడిచి ఏమీ లేదురా బుజ్జి నేనీ మధ్య ఒక సినిమా కథ రాసుకుంటున్నాను. అసలే ఈ మధ్య సినిమా రివ్యూ లు తెగ చదివేస్తున్నానేమో వెంటనే స్టొరీ లైన్ కాస్త చెప్పుదురు అని అడిగాను. వెంటనే గురువు గారు చెప్పడం మొదలుపెట్టారు.....

మొదట, విలన్ పరిచయం అదేనర్రా introduction  సీన్ అన్న మాట.... విలన్ తన ఏడంతస్తుల మేడ (den)  నుండి బయటకు వస్తాడు ఒకసారి రోడ్డు కు రెండు వైపులా ఉన్న ట్రాఫిక్ చూస్తాడు.... ఛీ ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది అని ఆలోచించి కారు వెనక సీట్లో డబ్బా లో నుండి రెండు కొబ్బరి కాయలాంటి బాంబులు తీసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి వేసేస్తాడు. తర్వాత నెమ్మదిగా హెలికాప్టర్ తాడు పట్టుకుని జంప్.....

ఇక మన వీరో అదేనండీ హీరో introduction - హీరో కూడా   అమీర్పేట్ లో ఉన్న తన ఆఫీసు నుండి బయటకు వచ్చి అవతల వైపు ఉన్న బస్సు స్టాప్ కు వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేద్దామని నిలుచుంటాడు.... ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది అసలు రోడ్డు క్రాస్ చేసే చాన్సు ఇవ్వనన్ని వెహికల్స్ వెళ్తుంటాయి..... కానీ హీరో మాత్రం ప్రశాంతంగా ఎదురు చూస్తుంటాడు దూరడానికి సందు కోసం అలా వెయిట్ చేసే చేసీ రాత్రవుతుంది తెల్లవారుతుంది.... ఏముంది ఇక లాభం లేదని ఆఫీసు టైం అయ్యిందని తిరిగి ఆఫీసు లోకే వెళ్తాడు......

ఇప్పుడు, ఆహా ఇప్పుడు వీరోఇన్ introduction , అప్పుడే పదో తరగతి పూర్తి ఐదో attempt  లో పూర్తి చేసి, అయ్య కొనిచ్చిన బెంజ్ కారులో జూనియర్ కాలేజీకి వస్తుంది.....

ఫైనల్గా మిగిలిన స్టొరీ ఏంటి అంటే విలన్ హెలికాప్టర్ లో కాకుండా కారులో హైదరాబాద్ రోడ్డు మీద ఎప్పుడు తిరుగుతాడు. ............. అమీర్పేట్ ఆఫీసు లో పని చేసే హీరో రోడ్ క్రాస్ చేసి బస్సు స్టాప్ కు ఎప్పుడు వెళ్తాడు. . . . .. . పదో తరగతే ఐదు attempts లో పూర్తి చేసిన వీరోఇన్ ఇంటర్ ఎన్ని attempt లలో పూర్తి చేస్తుంది అని.

క్లైమాక్ష్ కు ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా రాయలేదని గురువు గారు చెప్తుంటే ప్రొడ్యూసర్ ను అదేనండీ మన ప్రేమ రాజు పట్టుకోద్దామని పరుగో పరుగు. 


No comments:

Post a Comment